పవన్ కళ్యాణ్ ను చూసి పాఠం నేర్చుకున్నా..అతని ప్రసంగం ఒక కనువిప్పయిందన్నవర్మ…??

varma learn lot things from post on pawan kalyan speech

సంచలన దర్శకుడు, విమర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారో..ఎవరి మీద ఎటునుంచి ప్రేమగా మాట్లాడతారో..ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న..సమాధానం కూడా. అప్పుడెప్పుడో పవన్ గురించి ఆయన పార్టీ గురించి వివిధ వ్యాఖ్యలు చేసిన వర్మ అదే పవన్ కళ్యాణ్ పై ఈ సారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఎవరి మీద అయినా ఎప్పుడైనా ఎలా అయినా స్పందించే వర్మ పవన్ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పర్యటన గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. కానీ తాజాగా ఈ రోజు జనసేన అధినేతపై పేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు వర్మ. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటూ పోస్ట్ మొదలుపెట్టిన వర్మ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చూశానని అది చుసిన నేను ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యానని ఆయనకు ఉన్న పరిజ్ఞానాన్ని చూసి మురిసిపోయి అని చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ద్వారా గతంలో ఉన్న, ప్రస్తుతం వినిపిస్తున్న వాటిపై స్పష్టత ఇచ్చారని వర్మ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు. తన అభిప్రాయాలు, ఆలోచనలను చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం సిగ్గుపడలేదని పేర్లతో సహా ప్రకటించిన పవన్‌ను చూస్తుంటే తనకు ఎంతో ఎత్తు ఎదిగిన ఒక పర్వత శిఖరం అంత సమగ్రత పవన్ లో కనిపించిందన్నారు.

ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతానని పవన్ చెప్పడం చూసి, తాను ఇప్పుడు ఒక పాఠం నేర్చుకున్నానని..ఎందుకంటే తాను ఆలోచించకుండా మాట్లాడటం, మరియు ట్వీట్ చేయడం వంటివి చేస్తానని చెప్పారు. పవన్ పెద్ద నాయకుడిగా ఉంటాడని భావిస్తున్నా అందుకే ఎలాంటి ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని వర్మ అన్నారు. పవన్ ప్రసంగం విన్నాక తనకు కనువిప్పు కలిగిందన్నారు.

Comments

comments