వేట మొదలుపెట్టిన జక్కన్న..తట్టుకుని నిలబడగలరా…

rajamouli ntr ram charan multi starer hunting heroine selection

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత చేస్తున్న సినిమాకు కావాల్సిన క్రేజ్ మొత్తం సంపాదించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను నిజం చేస్తు తాజాగా చిరు కుటుంబ సభ్యులు ఆమోదం తెలపడం కొసమెరుపు. వీరిరువురి తీస్తున్న సినిమా కోసం కావాల్సిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు రాజమౌళి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా రాజమౌళి మాత్రం బాలీవుడ్ భామలను వెతికే పనిలో ఉన్నట్టు సమాచారం. బాహుబలి సినిమాతో జాతీయస్థాయి క్రేజ్ తో పాటు మార్కెట్ ను సైతం తనవైపు తిప్పుకున్న రాజమౌళి తాను తీయబోయే ప్రతీ సినిమాకు అలాంటి క్రేజ్ తోనే విడుదల చేసేందుకు గానూ అక్కడి భామలను వెతుకుతున్నట్టు ఫిలింనగర్ లో వినిపిస్తున్న మరో వార్త.

బాహుబలి సినిమాతో దాదాపు అన్ని భాషల్లోనూ మార్కెట్‌ని సృష్టించుకొన్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీస్తున్న సినిమా కూడా ఆ రేంజ్ లో విడుదలే లక్ష్యంగా రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో దాదాపు 150కోట్లతో నిర్మించబోతున్న ఈ సినిమా 2019లో విడుదల అయ్యేవిధంగా ప్లాన్ చేస్తునట్టు, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. మొత్తంగా రాజమౌళి చేతిలో పడబోతున్న ఆ భామలు ఎవరో ఎన్టీఆర్,చరణ్ ల సరసన ఏ మేర నటిస్తారో త్వరలోనే తెలియనుంది.

Comments

comments