పవన్ తో గుర్తుండిపోయేలా నితిన్ సినిమా..ఇది కదరా అభిమానం అంటే…!!

nithin-trivikram-pawan-kalyan-gurthunda-seethakalam

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు సరికదా కనీసం పోస్టర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

మాటల మాంత్రికుడు తన మార్క్ సినిమాలకు పెట్టే పేరు లాగానే ఈ సినిమాకు కూడా గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు టాక్. కాగా సినిమా టైటిల్ గురించి ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. నితిన్ సరసన లై సినిమాలో నటించిన మేఘా ఆకాష్ ఈ సినిమాలోనూ నటిస్తోంది. ఇటీవలే ఒక షెడ్యూల్ ను అమెరికాలో షూట్ చేసిన చిత్ర బృందం..మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తంగా నితిన్ శ్రేష్ట్ మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Comments

comments