బాబాయ్ ‘జై సింహా’ టీజర్ వచ్చేస్తుంది..

నందమూరి బాలకృష్ణ హీరోగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న సినిమా ‘జై సింహా’. కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ నటించారు. నిర్మాత సీ. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనువిందుచేయనున్నారు.

కాగా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను విజయవాడలో డిసెంబర్ 24న నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జై సింహా టీజర్ ను ఈ అర్జు సాయంత్రం 7:10 నిముషాలకి విడుదల చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులను సొంతం చేసుకోగా, అభిషేక్ పిక్చర్స్ నైజాం రైట్స్ ను దక్కించుకున్నారు.

Comments

comments