మరో భారీ మల్టీస్టారర్ పై కన్నేసి మాయచేసిన మాంత్రికుడు..

mahesh babu venkatesh trivikram multi starer

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జనవరిలో విడుదల చేసందుకుగానూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే మరో పక్క ఆడియో వేడుకకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ మాటల మాంత్రికుడు.

పవన్ తో సినిమా తరవాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా మొదలెడతాడు అని ఆ తర్వాత తీయబోయే సినిమా ఇండస్ట్రీలో మరో భారీ మల్టీస్టారర్ అని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. అయితే ఎన్టీఆర్ తో సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా అనుకున్న త్రివిక్రమ్ అది కాస్త మల్టీస్టారర్ గా తీయ్యబోతున్నట్టు..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాదిరే మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం.

ఈ సినిమాలో మహేష్ తో పాటుగా మళ్ళీ వెంకటేష్ అయితే బావుంటుందని వెంకీని కూడా సంప్రదించినట్టు అందుకు ఆయన కూడా ఓకే చెపినట్టు వినికిడి. మహేష్, వెంకీ కలిసి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుంది అందుకు కావాల్సిన స్క్రిప్ట్ ని కొంత సిద్ధం కూడా చేసాడు అని..మిగతాది ఎన్టీఆర్ తో సినిమా తర్వాత పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం.

Comments

comments