‘అజ్ఞాతవాసి’ కాపీ వివాదంపై ఫారిన్ డైరెక్టర్ షాకింగ్ ట్వీట్

‘అజ్ఞాతవాసి’ టీజర్ రిలీజైనప్పటి నుంచి ఇది హాలీవుడ్ మూవీ ‘లార్గో వించ్’కి కాపీ అని ప్రచారం జరుగుతూనే వస్తోంది. బెల్జియంకు చెందిన ఒక నవల ఆధారంగా 2008లో ‘లార్గో వించ్’ సినిమాని రూపొందించగా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని.. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ని తెరకెక్కించాడని ఇండస్ట్రీలో పెద్ద దుమారం అయ్యింది.

ఈ వార్త అటుఇటు చక్కర్లు కొడుతూ చివరికి ‘టీ-సిరీస్’ సంస్థకి చేరింది. ‘లార్గో వించ్’ సినిమా తాలూకు ఇండియా కాపీరైట్స్‌ని ‘టీ-సిరీస్’ సొంతం చేసుకోవడంతో.. ‘అజ్ఞాతవాసి’కి ఆ సంస్థ లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. సినిమా రిలీజయ్యాక ‘లార్గో వించ్’ ఛాయలు కనిపిస్తే.. నోటీసులు పంపేందుకు రెడీ అయ్యింది. నిన్నటివరకు ఈ కాపీ అలిగేషన్స్‌ని పెద్దగా పట్టించుకోని ‘టీ-సిరీస్’.. ఇప్పుడు చాలా సీరియస్‌గా తీుసుకోవడంతో.. ఈ వార్త ఒక్కసారిగా వరల్డ్‌వైడ్‌గా పాకిపోయింది. ఆఖరికి ‘లార్గో వించ్’ దర్శకుడు జిరోమ్ సెలేకి ఇది చేరింది. దీంతో ఆయన ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

‘‘‘టీ-సిరీస్’ సంస్థ ‘అజ్ఞాతవాసి’ సినిమాకి లీగల్ నోటీసులు పంపేందుకు రెడీ అయ్యింది’’ అని ఒక వార్త రాసిన ఒక వెబ్‌సైట్ లింక్‌ని షేర్ చేస్తూ.. ‘‘నేను ‘అజ్ఞాతవాసి’ టికెట్ కొనబోతున్నాను. ఆ సినిమా చూసేందుకు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నా’’ (”I think I’m gonna buy a ticket (plane first than movie) #Curiosity #Agnyaathavaasi #LargoWinch”) అంటూ ట్వీటాడు. తాను తీసిన చిత్రం ఫ్లాప్ కావడం, ‘అజ్ఞాతవాసి’పై విపరీతమైన క్రేజ్ రావడంతో.. ఈ చిత్రం ఆ దర్శకుడి దృష్టిని మళ్లించింది. దీంతో.. ఈ సినిమా టాపిక్ ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా రచ్చయ్యింది.

అది సరేగానీ.. ఒకవేళ ఈ చిత్రం ‘లార్గో వించ్’కి కాపీ అని తేలితే మాత్రం లీగల్‌గా చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ‘టీ-సిరీస్’ సంస్థ చాలా సీరియస్‌గా ఉండడాన్ని చూస్తుంటే.. ఇదో పెద్ద వివాదంగా మారేలా కనిపిస్తోంది. మరి.. త్రివిక్రమ్ దీన్ని ఎలా తెరకెక్కించాడో చూడాలి.

Comments

comments