భారీ ఆఫర్ ని వద్దనుకుంటున్న పవన్..కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు ..??

janasena pawan kalyan producers offer reject

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులో ఏమి ఉందో తెలియదు గానీ.. పేరు విన్నా, పలికినా ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది అభిమానులకి. అభిమానుల గుండెల్లో అంతటి గొప్ప స్థానం పొందిన పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరో పక్క జనం సమస్యలమీద పోరాటం సాగిస్తూ అధికార ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలే గానీ సినిమా తీయడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వరుస కడతారు. అలాంటిది స్థాపించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమాలు చేస్తున్న ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీలోనే ఎవరికీ ఇవ్వని ఒక పెద్ద ఆఫర్ ని పవన్ కళ్యాణ్ ముందుంచింది. ఆ ఆఫర్ విలువ ఎంతో తెలుసా అక్షరాలా 40కోట్ల రూపాయలు.

అంతటి భారీ ఆఫర్ ని మరే హీరో కూడా ఇప్పటి వరకు చూసి ఉండడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సున్నితంగా ఆ ఆఫర్ ని వదులుకున్నాడు..కాదు కాదు..వదిలేసాడు. ఎందుకో తెలుసా 2019లో ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు. జనం కోసం స్థాపించిన పార్టీ జనసేన..ప్రశ్నించడానికి వచ్చే నేత పవన్.

జనం కోసం స్థాపించిన పార్టీని బలోపేతం చేసి సమస్యలను తొలగించడానికి ఎక్కడ ఇబ్బంది కలుగుద్దో అనే ఒక్క కారణం చేత 40కోట్ల రూపాయల ఆఫర్ ని వదిలేసిన మహానుభావుడు. ఈ కాలంలో కూడా జనం మనం అని ప్రాకులాడే నాయకులు ఉన్నారు అంటే అది ఒక్క పవన్ తర్వాతే అని ఈ సంగతి తెలిసిన అభిమానులు తమ అభిమాన నటుడి గురించి పొంగిపోతున్నారు.

Comments

comments