‘హలో’ 11 రోజుల కలెక్షన్స్.. 50 శాతానికే హాంఫట్

మామూలుగా పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదలిపేస్తాయి. కలెక్షన్ల మోతతో బయ్యర్లకు లాభాల వర్షం కురిపిస్తాయి. కానీ ‘హలో’ సినిమా మాత్రం అందుకు భిన్నంగా బోల్తాకొట్టేసింది. భారీ వసూళ్లు రాబట్టాల్సింది పోయి.. తక్కువ వసూళ్లతో డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. వర్కింగ్ డేస్ కంటే హాలిడేస్ ఎక్కువగా వచ్చినప్పటికీ వాటిని క్యాష్ చేసుకోలేకపోయింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.16.70 కోట్లు షేర్ రాబట్టినట్లు తేలింది. నిజానికి.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన వసూళ్లతో పోల్చుకుంటే.. కేవలం 50 శాతం మాత్రమే రికవర్ చేయగలిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ చిత్రం టోటల్ రన్‌లో రూ.18 కోట్లే చాపచుట్టేస్తుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన.. బయ్యర్లకి రూ.15 కోట్లు నష్టం వాటిల్లినట్లే!

విక్రమ్ కుమార్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్, నాగార్జునలాంటి స్టార్ హీరో, విపరీతమైన పాజిటివ్ టాక్, హాలిడేస్.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకోలేకపోయింది. పాపం అఖిల్.. ‘హలో’తో ప్రకంపనలు సృష్టిద్దామనుకుంటే వీక్ సిగ్నల్ అతడ్ని దెబ్బతీశాయి. ఇక ఏరియాలవారీగా వసూళ్లు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..

నైజాం : 4.85
సీడెడ్ : 1.98
ఉత్తరాంధ్ర : 1.37
గుంటూరు : 1.10
ఈస్ట్ : 0.69
వెస్ట్ : 0.61
కృష్ణా : 0.92
నెల్లూరు : 0.48
ఏపీ+తెలంగాణ : 12.00
రెస్టాఫ్ ఇండియా : 1.40
ఓవర్సీస్ : 3.30
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ.16.70 కోట్లు

Comments

comments