చిరు మానవత్వానికి హాస్యనటుల జేజేలు..హ్యాట్సాఫ్ చిరు..!!

chiru gave money gundu hanumantharao potti veeraiah 2lacs

టాలీవుడ్ హాస్యనటులకు గడ్డుకాలం వచ్చిందా..వరసగా జబ్బుల బారిన పడుతున్న వారిని ఆదుకునేవారు లేరా అనుకుంటున్న సమయంలో మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారికిది అండగా నిలిచింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ గారు స్పందించిన తీరు అభినందనీయం. తెలుగు హాస్యనటుడు గుండు హనుమంతరావు గతకొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో భాదపడుతున్నారు.

ఈ సంగతి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హాస్యనటుడు గుండు హనుమంతరావు చికిత్సకోసం 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు.‘మా’ జాయింట్‌ సెక్రటరీ ఏడిద శ్రీరామ్‌, కల్చరల్‌ కమిటీ ఛైర్మన్‌ సురేష్‌ కొండేటి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సురేష్‌ అపోలో ఆసుపత్రికి వెళ్లి, చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా హనుమంతరావు.. చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడారు.

మరో హాస్యనటుడు పొట్టి వీరయ్య గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన తరపున 2లక్షల రూపాయల చెక్ ను అందించారు. వీరయ్యను ‘మా’ కార్యాలయానికి పిలిపించి శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్‌ చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం చిరంజీవి ఫోన్‌ చేసి, వెంటనే ఇంటికి రా అన్నారు.

నేను, శ్రీరామ్‌ వెళ్లాం. గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్య కష్టాల్లో ఉన్నట్లున్నారు.. వెంటనే వాళ్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు ఇవ్వు అంటూ చిరు చెక్‌లు ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఎవరు కష్టాల్లో ఉన్నా నాతో చెప్పు..సాయం చేద్దాం అన్నారు. ఈ విషయంలో నేను ‘మా’ అధ్యక్షుడిగానే కాకుండా ఓ నటుడిగా చాలా సంతోషించాను. హ్యాట్సాఫ్‌ చిరంజీవి అని ఆయన చెప్పారు.

Comments

comments