భాగమతి అనుష్క సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్ వచ్చేసింది…

టాలీవుడ్ హాట్ అండ్ గ్లామర్ బ్యూటీ అనుష్క భాగమతి టీజర్ విడుదలైంది. ఇప్పటి వరుకు గ్లామర్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అనుష్క నెమ్మది నెమ్మదిగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు అనడంలో సందేహంలేదు. అరుంధతి, రుద్రమదేవి సినిమాలలో అనుష్క నటన అద్భుతం. తాజాగా అంతే స్కోప్ ఉన్న సినిమా భాగమతితో ప్రేక్షకులముందుకు రాబోతుంది అనుష్క.

జీ అశోక దర్శకత్వం వహిస్తున్న భాగమతి సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే అంధతిలో అనుష్క నటించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. ఒక పాత ఇంట్లోకి నడిచి వచ్చే సీన్లో అనుష్క చేతిలో ఒక సుత్తి..ఆ సుత్తితో తన చేతికి మేకు కొట్టుకునే దృశ్యాలతో టీజర్ ని విడుదల చేశారు. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తున్న ఈ సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకునేలా చేస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, విద్యు రామం, జయరాం, ఉన్ని ముకుందన్, ఆశ శరత్ నటిస్తున్నారు. 2018 జనవరి 26న సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తన్నారు చిత్ర యూనిట్.

Comments

comments