పవన్ ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ సాంగ్, టీజర్ అప్పుడే..!!

agnyaatavaasi-teaser-pawan kalyan special song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ పై ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందించారు. పవన్ స్పెషల్ సాంగ్ ని చిత్రానికి సంబంధించిన టీజర్ ని డిసెంబర్ 16న విడుదల చేస్తున్నట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసారు చిత్ర యూనిట్.

agnyaatavaasi-teaser
agnyaatavaasi-teaser

జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే గాలి వాలుగా పాటను విడుదల చేసిన యూనిట్ ఇప్పుడు టీజర్ తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుద్ రవిచంధర్ ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ క్లాస్ లుక్ తో పాటు మాస్ లుక్ లో కూడా అలరించనున్నాడు.

Comments

comments