స్టార్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న నాని..!!మిడిల్ క్లాస్ అబ్బాయి ట్రైలర్ వచ్చేసింది..

middle class abbayi trailer release

నాచురల్ స్టార్ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో నాని సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి నటించింది. ఇప్పటికే ఫస్ట్ ట్రైలర్ ని విడుదల చేసిన యూనిట్..తాజాగా రెండవ ట్రైలర్ ని విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో కనిపించనున్నారు.

మాది మిడిల్ క్లాస్ అన్నా అర్ధరూపాయి పెట్రోల్ ధర పెరుగుతుంది అంటే అర్ధరాత్రి పెట్రోల్ బంక్ బయట అరకిలోమీటర్ క్యూలో నిలబడతాం..అలాంటిది మా ఫ్యామిలీ జోలికొస్తే…మా అందరికి పేస్ బుక్ అనే ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది అందులో ఏదైనా ఇంటరెస్టింగ్ వీడియో దొరికితే చాలు షేర్.. షేర్.. షేర్.. అని కొట్టిపారేస్తాం…అంటూ నాని చెప్పే డైలాగ్ సినిమాపై హైప్ ని అమాంతం పెంచేసింది.

సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను డిసెంబర్‌ 21న క్రిస్టమస్‌ కానుకగా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. కాగా అదే సమయంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘హలో’ సినిమా విడుదల కూడా ఉండటంతో ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. థియరిటికల్ ట్రైలర్ మీకోసం..

Comments

comments