పవన్ కళ్యాణ్ పిల్లోడు, కోన్ కిస్కా గొట్టంగాడు..జగనన్నకు సైన్యం ఉంది..అన్నను ఏమైనా అంటే చంపేస్తా..వైరల్ అవుతున్నవీడియో…

jagan fan venkatreddy warning pawan kalyan video viral

ఎటు పోతుంది సమాజం ఏమైపోతుంది జీవనం..ఒక పక్క బ్రతుకు బండి ఎలా లాగాలి అని నిరుద్యోగ యువత నానా తంటాలు పడుతుంటే..పనీ పాటా లేని కొందరు జనంలో ఎలా ప్రాచుర్యం పొందాలి అని చూస్తున్నారు. అలా జరిగిందో లేదంటే ఎవరైనా చెప్పి చేయించారో కానీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై  విరుచుకు పడ్డాడు..కటకటాలు లెక్కపెడుతున్నాడు జగన్ వీరాభిమాని వెంకటరెడ్డి. జగనన్నను ఏమి అయినా అంటే చంపేస్తానని పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తూ సెల్ఫీ వీడియో తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు జగన్ వీరాభిమాని తియ్యగూర వెంకటరెడ్డి. ఇతను శ్రీనివాసరావు అనే వ్యక్తిని, తన్నీర్‌ అనే వ్యక్తిని హత్యచేసిన రెండు హత్యకేసులో నిందితుడని పోలీసులు తెలపడం కొసమెరుపు.

జగనన్నతో పోలిస్తే పవన్ కళ్యాణ్ పిల్లోడని, కోన్  కిస్కా గొట్టంగాడని..జగనన్నకు సైన్యం ఉందని అలాంటి జగనన్నను ఎవరు అయినా ఏమి అయినా అంటే ఊరుకునేది లేదని అన్న కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధం అని హెచ్చరించిన వెంకటరెడ్డి జబర్దస్త్ ప్రోగ్రాంలో హైపర్ ఆదితో  పవన్ సమానమని ప్రజలకు జగన్ దేవుడని ఆయన ఫోటోలు ఇంట్లో దేవుడి ఫొటోలతో పాటు పెట్టుకుని పూజిస్తారని వ్యాఖ్యానించాడు. పలు అసభ్యకర వ్యాఖ్యలు, తీవ్ర పదజాలంతో నిండిన ఆ వీడియోలో తనది గుంటూరు అని చేతనైతే పవన్ సైన్యం వచ్చి పీక్కోవాలని ఇష్టం వాచినట్టు వాయించేసాడు.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

ఇటు పవన్ అభిమానుల్లో, అటు జగన్ వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపిన ఈ వీడియో పోలీసుల చేతికి చిక్కింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి బుధవారం వెంకటరెడ్డిని అరెస్టు చేశారు.  వెంకటరెడ్డి ప్రస్తుతం హీరో నితిన్ రెడ్డి, దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి ఆలిండియా ఫ్యాన్స్  అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఇక ముందు ఎవరైనా సోషల్‌ మీడియాలో ఇలా హెచ్చరికలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నల్లపాడు సీఐ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. మరి దీనిపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments

comments