హైదరాబాద్ లో ఐటీ ఘనత చంద్రబాబుదే: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎప్పుడు,ఎక్కడ అభివృద్ధి గురించి మాట్లాడినా హైద్రాబాద్ లోని హైటెక్ సిటీ, సైబరాబాద్ లేకుండా ఆయన ప్రసంగంలో ముగింపు ఉండదు. హైదరాబాద్ కి ఐటీని తీసుకొచ్చింది తనే  అని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన చెప్పేదానిలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఆయనపై విమర్శలు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి .

కానీ మొట్ట మొదటి సారి తెలంగాణా ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత,  హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో చంద్రబాబుదే కీలక పాత్ర అని మంత్రి  కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంలో నా కృషి ఏమీ లేదు ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

హైటెక్ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Comments

comments