“జనసేన” పార్టీకి బలాన్నిస్తున్నది ఆ పెద్దలేనా..డబ్బుల్లేని పవన్ కు సాయం చేసేది వాళ్లేనా…??

janasena-pawan-kalyan-mega-family-babu-jagan-ap-politics

తెలుగునాట రాజకీయ వేడి అప్పుడే మొదలైంది..అవును ఒక పక్క జగన్ పాదయాత్ర..మరో పక్క పవన్ పరామర్శ యాత్ర..ఇంకో పక్క బాబు ఢిల్లీ యాత్ర..ఇలా ఒకరికి ఒకరికి ఒకరు..రాజకీయ క్రీడలో ఈ సారి గెలుపు గుర్రమెక్కే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు బాబు ఏమి చేసాడో..చేస్తున్నాడో..ఆయనకి ఆయన మంత్రులకు తెలుసు..అలానే జగన్ ఏమి చేస్తున్నాడో..ఏమి చేస్తాడో ఎవరికీ తెలియక పోయినా తెలిసినట్టే ఉంటున్నారు. ఇక మిగిలింది ఈ మధ్యనే పార్టీని స్థాపించి నా దగ్గర డబ్బులు లేవు మీరు నా సినిమాలు చూస్తేనే నాకు డబ్బులు వస్తాయి..అప్పుడు నేను మీకు సాయం చెయ్యగలను..కానీ..అప్పటి వరకు ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ వస్తున్న జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మరి ఈ పవర్ ఏ మేర పని చేస్తుంది..ఎంతవరకు ప్రశ్నిస్తుంది. మరి డబ్బులే లేవు అంటున్న పవన్ కు రాజకీయాల్లోకి రావడానికి ఎవరు సహాయం చేస్తున్నారు..ఎన్నికలలో పోటీ చెయ్యాలి అంటే కనీసం డబ్బు ఉండి తీరాలి కదా..అసలే తెలుగు రాష్ట్రము పైగా డబ్బు పంపకం జరగనిదే గెలవడం కష్టం..మరి ఇలాంటి డబ్బుతో ముడిపడిన రంగాన్ని పవన్ ఎందుకు ఎన్నుకున్నాడు..నిజంగా ప్రజలకు సేవ చెయ్యడానికే అయితే ఎదో ఒక విధంగా సహాయం చెయ్యవచ్చు కదా..ప్రజలకు సేవ చెయ్యాలి అంటే రాజకీయాలే కావాలా..పోనీ రాజకీయాలే మంచిది.. జనాన్ని దగ్గరనుంచి చూసి సాయం చేద్దామనుకుని ఉండవచ్చు కానీ..రాజకీయ రంగ ప్రవేశం చేశాక  అధికారం లేకుండా ఏమి చెయ్యలేరు కదా..మరి అధికార పీఠమెక్కిన వారంతా నిజంగా జనానికి సాయం  చేస్తున్నారా..వారిని ఆదుకుంటున్నారా..అంటే కేవలం అధికారం కోసమేనా ఈ ప్రాకులాట.

ఇంతకీ అన్నీ జరిగితే ముందు పీఠం ఎక్కడానికి డబ్బు కావాలి కదా ..అసలు ఆ డబ్బే లేకుండా పవన్ ఇంత సాహసం చేస్తాడా..ఇంత సాహసానికి ఎవరో తోడ్పాటు అందిస్తున్నారు..ఎవరు ఆ తెర వెనక ఆర్ధిక, అంగ బలాన్ని అందిస్తున్నది. ఒకానొక సమయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి చేత చంద్రబాబుకి చెక్ పెట్టడం కోసమే ప్రజారాజ్యం పార్టీని స్థాపింపజేసేలా ఉసిగొల్పినట్టు ఇప్పుడు జగన్ కి చెక్ పెట్టడం కోసం బాబు ఈ పన్నాగం పన్నాడా..లేక పవనే దైర్యం చేశాడా. ఇంతకు ముందువచ్చిన వారంతా ప్రజలకు సేవ చేస్తాం అంటూ వచ్చిన వారే పార్టీలను స్థాపించిన వారే.  కానీ ఆ పార్టీలు ఏమి అయ్యాయో స్థాపించిన వారికి కూడా తెలుసో లేదో. ఏ టీవీ ప్రోగ్రాంలోచూసినా..ఏ పార్టీ మీటింగులో విన్నా ఒక్కటే పేరు పవన్. ఇదంతా నిజంగా పవన్ మీద అభిమానంతో చేస్తున్నారా లేక సినిమా ప్రొమోషన్ల లాగా తెరవెనక ఉండి నడిపిస్తున్నవారే ఇలా చేయిస్తున్నారా. అంతేకాకుండా త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సూచనప్రాయంగా తెలిపిన చరణ్ బాబాయ్ వెనకున్నాడా..మెగా కుటుంబం మొత్తం ఒక్కటిగా జనసేన పార్టీని ఆదుకుంటారా అంటూ వస్తున్న వార్తలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. ఇలా ఎవరో ఒకరి అండ లేకుండా అయితే పవన్ ఇంత సాహసానికి దిగడు అనేది జనంలో కలుగుతున్న అనుమానం..వేచి చూద్దాం బాబు తెలివితేటల ముందు జగన్, పవన్ ఏ మేర తమ సత్తా చూయిస్తారో..ఎవరి మీద ఎవరు గెలిచి అధికారపీఠం ఎక్కుతారో..ప్రజా సమస్యలు తీర్చే ఆ నాయకుడు ఎవరో.

Comments

comments