ఉత్తరాది ప్రజలు కోరుకునేది మోదీనా..?? రాహుల్ నా..??

gujarat-himachal-pradesh-election-result-release

నెమ్మది నెమ్మదిగా దేశమంతా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉత్తరాదిన మొదలైన ఎన్నికల కోలాహలాన్ని బట్టి ఎవరు అధికారం చేపడతారా అని యావత్తు దేశం మొత్తం ఎదురుచూస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాలలో ఎవరు అధికారం చేపడతారని, చేపట్టాలని కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు. నోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన మోదీ నాయకత్వంలోని బీజేపీనా, మోదీకి ఇన్నాళ్లకు సరైన పోటీ ఇవ్వగలిగే నాయకుడిగా భావిస్తున్న రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీనా. ఇప్పటికే లెక్కింపు జరుగుతున్న రెండు రాష్ట్రాలలో మోడీ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్ర ప్రజలు ఉన్నట్టుండి కొత్త నాయకత్వానికి జై కొడతారా. సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మోదీ తన సత్తా నిరూపించుకున్నారా..హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మోదీ నాయకత్వానికి పట్టం కడతారా..పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు చేప్పట్టిన యువ నాయకుడు రాహుల్ నాయకత్వానికి పట్టం కట్టబోతున్నారా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు. మరి కొద్ది సేపట్లో ఫలితాలు పూర్తి స్థాయిలో తెలియనున్నాయి.

Comments

comments