సునీల్ అన్న రికమండ్ చెయ్యడం వల్లనే నేను ఇండస్ట్రీలో ఉన్నా: నాని

sunil-2-countries-audio-function-nani-proud

మిడిల్ క్లాస్ కుర్రోడు నాచురల్ స్టార్ నాని..పూలరంగడు గురించి కొన్ని జీవిత సత్యాలు చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు నటించిన ‘డీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సునీల్ రికమండ్ చెయ్యడం వల్లనే తాను ఈ స్టేజి లో ఉన్నానంటున్నాడు. హీరో కాకముందు నుంచి సునీల్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉండేదని..తాను స్టార్ కమెడియన్ గా ఉన్నప్పుడు సైతం నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడని నాకు కాన్ఫిడెంట్ ఇచ్చిన వ్యక్తి సునీల్ అన్న అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

సునీల్ నటించిన ‘2కంట్రీస్’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నాని ఈ సినిమా పెద్ద అవుతుంది అందులో సందేహం లేదు అన్నారు నాని. సునీల్, మనీష రాజ్ జంటగా ఎన్.శంకర్ దర్శకత్వంలో ‘2కంట్రీస్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. హార్ట్ ను టచ్ చేసే ఎలెమెంట్స్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది..చీకటిని చీకటి జయించదు..వెలుగే జయిస్తుంది. ద్వేషాన్ని ద్వేషం జయించదు..ప్రేమ మాత్రమే జయిస్తుంది. ప్రస్తుతం యువత అవకాశాలను మరిచి వింత పోకడలవైపు చూస్తున్నారు. సునీల్ ఒక ట్రాన్సఫార్మర్.

తాను ఓన్ చేసుకుని నటించాడు. నిజమైన ప్రేమ గుండెకు తగిలితే ఎలా ఉంటదో తెలిపే సినిమా మా ఈ ‘2కంట్రీస్’ అని శంకర్ తెలిపారు. హీరో సునీల్ మాట్లాడుతూ మళయాళ హీరో దిలీప్ సినిమాలు నాకు చక్కగా సరిపోతాయి. పూల రంగడు సినిమా ఆయన నటించిన సినిమా నుంచే రీమేక్ చేసి మంచి విజయం సాధించా. ‘2కంట్రీస్’ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 29న సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు చిత్ర యూనిట్.

Comments

comments