‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’..రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూయిస్తానంటున్న వర్మ…??

ram gopal varma kadapa rayalaseema redla nijaalu web series

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన వివాదానికి తెరలేపాడు..వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ‘రక్తచరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన ఇప్పుడు ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ పేరిట ఓ వెబ్‌ సిరీస్‌ తీయబోతున్నారు. ఎప్పుడూ వివాదాస్పద వాఖ్యాలతో వార్తల్లో నిలిచే వర్మ..తాను తీయబోతున్న వెబ్ సిరీస్ గురించి వర్మ చెప్పిన విషయాలు..‘‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ వెబ్‌ సీరీస్‌ వెనుక నా సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన ఉద్దేశం ఏమిటంటే.. నేను డిజిటల్‌ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం.. వెండితెర మీద నాకు నచ్చినట్లు చెప్పనివ్వని కథల్ని ఎవడి గురించీ పట్టించుకోకుండా నాకు నచ్చినట్లు చెప్పడం కోసం అంతేకాకుండా ముంబయి మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌తో నేను నిర్మిస్తున్న ‘గన్స్‌ అండ్‌ థైస్‌’ సిరీస్‌ తర్వాత నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు అంతర్జాతీయ వెబ్‌ సీరీస్‌ ఈ ‘కడప’’.

‘హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఈగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఒకే ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్‌ పుట్టింది. ‘రక్తచరిత్ర’ తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ల బాధితులు, బంధువులు ఇలా ఎందరికో డబ్బులిచ్చి, బెదిరించి, మాటలతో మభ్యపెట్టి వాళ్ల గుండెల్లో దాచుకున్న రహస్యాలను బయటికి లాగేసిన మెటీరియల్‌ నుంచి పుట్టిందే ఈ కడప కథ’. నేను ఈ సబ్జెక్ట్‌ని గతంలో రక్తచరిత్రలో డీల్ చేశాను కదా అని కొందరు ఇడియట్లు భావించవచ్చు. కానీ అది కేవలం 5% మాత్రమే నిజం. దానికి కారణం రక్తచరిత్రలో అసలు నిజాలని చాలా పైపైన చూపించాను.

లోపలి పూర్తి నిజాలు అప్పటికి నాకు తెలియకపోవడం, కొన్ని వార్నింగ్‌లు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి ఇతరత్రా కారణాల వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయాను. దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీల్ అయినా కేర్ చెయ్యకుండా నిజం కథని నిజంగా చూపించడానికి సైకిల్ చెయిన్ మీద ఒట్టుగా కంకణం కట్టుకున్నాను. ఈ “కడప” వెబ్ సిరీస్ ట్రైలర్ రేపు..అంటే 15 డిసెంబర్ ఉదయం 10 గంటలకి రిలీజ్ అవ్వబోతుందని వర్మ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం వర్మ అక్కినేని నాగార్జునతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వర్మ పోలీస్‌ అధికారి పాత్రలో కన్పించబోతున్నారు.ఇందులో నాగ్‌కి జోడీగా మైరా సరీన్‌ నటిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈచిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నట్లు వర్మ తెలిపిన విషయం తెలిసిందే. మరోపక్క నందమూరి తారక రామారావు జీవితాధారంగా వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Kadapa Redla Nijaalu
RGV·WEDNESDAY, 13 DECEMBER 2017
Why the web series KADAPA?
My only objective of entering into the digital world is to be able to tell a story which I otherwise would have never been allowed to tell on a film screen. My second product on this platform after my Hindi Web series on the Mumbai Mafia called “Guns and Thighs” (youtu.be/4pjTcLLciuU) will be the first ever original Telugu web Series made for an international audience titled KADAPA.
The title is derived as a summation of what a region stands for in its blood thirstiness a synonym of how violent Power affects the internal politics of ambition,ego,greed and one upmanship. The story of the entire series of KADAPA is something I have gathered over many years ever since I first researched Raktacharitra with my extensive interactions with ex factionists to their victims’s,their relatives and so on.
Some might feel that I have dealt with this subject matter in my earlier film RaktaCharitra but nothing could be further from the truth. That’s because in that film, I barely scratched the surface of the truth of the Rayala Seema’s hardcoreness due to my inconclusive knowledge at that time and also due to various restrictions and threats , but here in this web series I decided to tell it the way it is without any fear and complete honesty

This Series is as much intended for the international audience in terms of wherever violent power has been used to suppress any form of rebelliousness. Everybody needs to know the history of an interesting and overbearing region and I strongly believe this Series will document those very important times in the most naked way possible for those who did not witness it first hand.
Trailer of this series of Season 1 called KADAPA is releasing tomorrow that is December 15th at 10 Am
– Ram Gopal Varma

“కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర” వెబ్ సిరీస్ వెనుక నా సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన సదుద్దేశ్యం ఏమిటంటే…
నేను డిజిటల్ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం..వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా నాకిష్టం వచ్చినట్టు చెప్పడం కోసం. ఈ బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం వరల్డ్ ప్రేక్షకుల కోసం ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో నేను నిర్మిస్తున్న గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత (youtu.be/4pjTcLLciuU) నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ “కడప”.

హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్ పుట్టింది. రక్తచరిత్ర తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ బాధితులు, వాళ్ల బంధువులు, వాళ్లింట్లో పని చేసే వాళ్ల నుంచి,మరియు ఎందరి నుంచో నేను డబ్బులిచ్చి,బెదిరించి,మాటలతో మభ్యపెట్టి వాళ్లు గుండెల్లో దాచుకున్న రహస్యాలని బయటికి లాగేసిన మెటీరియల్ నుంచి పుట్టిందే ఈ “కడప” నిజం కథ.

నేను ఈ సబ్జెక్ట్ ని గతంలో రక్తచరిత్రలో డీల్ చేశాను కదా అని కొందరు ఇడియట్లు భావించవచ్చు. కానీ అది కేవలం 5% మాత్రమే నిజం. దానికి కారణం రక్తచరిత్రలో అసలు నిజాలని చాలా పైపైన చూపించాను. లోలోపలి పూర్తి నిజాలు అప్పటికి నాకు తెలియకపోవడం, కొన్ని వార్నింగ్ లు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి ఇతరితరా కారణాల వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయాను.

దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీల్ అయినా కేర్ చెయ్యకుండా నిజం కథని నిజంగా చూపించడానికి సైకిల్ చెయిన్ మీద ఒట్టుగా కంకణం కట్టుకున్నాను.
ఈ “కడప” వెబ్ సిరీస్ ట్రైలర్ రేపు..అంటే 15 డిసెంబర్ ఉదయం 10 గంటలకి రిలీజ్ అవ్వబోతోంది.

రామ్ గోపాల్ వర్మ

Comments

comments