నింగికెగసిన మరో బాలీవుడ్ నటుడు..!!

బాలీవుడ్ నటుడు, దర్శకుడు నీరజ్ వోరా (54) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ‘వెల్‌కం బ్యాక్‌’, ‘బోల్‌బచ్చన్‌’, ‘ధడకన్‌’ తదితర చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు నీరజ్. ‘ఖిలాడి420’, ‘గోల్‌మాల్‌’ చిత్రాలకు రచయితగా పనిచేశారు. 2016లో గుండెపోటు రావడంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయిన  నీరజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయారు. కొంత కాలానికి కోమా నుంచి బయట పడిన ఆయన కాస్త ఆరోగ్యం మెరుగునపడడంతో ముంబాయికి  మార్చారు. నీరజ్ స్నేహితుడు నడియాద్ వాలా తన ఇంట్లో ఉంచుకుని చికిత్స అందించారు. మెల్లగా ఆరోగ్యం క్షీణించడంతో ముంబయి లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించగా గురువారం తెల్లవారు జామున అనంతలోకాలకు వెళ్లిపోయారు నీరజ్. నీరజ్ మృతికి పలువురు ప్రముఖులు, బాలీవుడ్ తారాగణం సంతాపం ప్రకటించారు.

neeraj vora passed away Bollywood film industry
neeraj vora passed away Bollywood film industry

 

 

 

 

Comments

comments