అంతా కలిసి కుట్రచేశారు..బరినుంచి తప్పించారు..??

mass-maharaj-raviteja-touch-chesi-chudu-post-poned-from-sankranti-fest

మాస్ మహారాజ్ రవితేజ చాలాకాలం గ్యాప్ తీసుకుని చేసిన ‘రాజా ది గ్రేట్’ మంచి సక్సెస్ ను సాధించింది. మళ్ళీ గాడిన పడిన రవితేజ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన రాశికన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తుండగా నల్లమలపు బుజ్జి, వంశీ వల్లభనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న రవితేజ నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉందని అంతా ఊహించారు. కానీ సినిమా షూటింగ్ పార్ట్ కొంత మిగిలిఉండడం వలన రవితేజ ‘టచ్ చేసి చూడు’ సంక్రాంతి బరినుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. ప్రీతం సంగీతం అందిస్తున్న ఈ సినిమా రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.

Comments

comments