కేసులకు చిక్కకుండా జగన్ మాస్టర్ ప్లాన్

దేశ రాజకీయాల్లో చాలామంది ప్రజాప్రతినిధుల్లో (ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు) చాలామంది క్రిమినల్‌ కేసులు, నేర అభియోగాలు ఎదుర్కొంటున్నవాళ్లే ఉన్నారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వీరి కేసుల్ని ఇదివరకు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం దుమ్ముదులిపేందుకు సుప్రీంకోర్టు చాలా పట్టుదలతో ఉంది. వారివల్ల దేశానికి ఎలాంటి ప్రయోగం లేకపోగా మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని.. అందరినీ కడిగిపారేసేందుకు స్పీడుగా పావులు కదుపుతోంది.

ఓవైపు ఈ కేసులు ఏళ్లతరబడి కోర్టుల్లోనే మూలుగుతుంటే.. వాళ్లు మాత్రం ఎన్నికల్లో పోటీచేస్తూ ఉన్నత పదవుల్ని అవరోధిస్తున్నారు. ఈ వ్యవస్థని పూర్తిగా మార్చేయాలనే ఉద్దేశంతో కోర్టులు, ఎన్నికల సంఘం, సామాజిక కార్యకర్తలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. మార్చి నుంచి ప్రజా ప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం, కేంద్రం దాన్ని అంగీకరించడం, మార్చిలోపు ఈ ప్రక్రియను కొలిక్కి తేవాలని నిర్ణయించాయి.

ఈ విషయం తెలుసుకున్న నేతలు.. తమపై ఉన్న కేసుల్ని నామరూపాలు లేకుండా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కోర్టుకి చిక్కకుండా నానా అవస్థలు వేస్తున్నారు. వీళ్లలో ప్రతిపక్ష నేత జగన్ కూడా ఉన్నారు. ఈయన 11 కేసుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ కోర్టుల్లో వాటిపై విచారణ జరుగుతోంది. వీటిల్లో ఏది నిరూపితమైనా.. ఎన్నికల్లో పోటీ చేయటానికి, పదవులు చేపట్టడానికి అనర్హుడు అవుతాడు. అందుకే.. వాటినుంచి తప్పించుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

జగన్‌ మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ‘ప్రత్యేక హోదా’ కోసం అని చెప్పి ఆ పేరుతో రాజీనామా చేస్తారని… అప్పుడు వారు సాంకేతికంగా చట్టసభ సభ్యులు కారు కాబట్టి వారు ఆ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల పరిధిలోకి రారని విశ్లేషిస్తున్నారు. దానివల్ల ఇప్పటికప్పుడు జగన్‌ కేసులు తేల్చాల్సిన అవసరం ఉండదని, తద్వారా 2019 ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని జగన్ యోచిస్తున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Comments

comments