తెలుగుదేశం పార్టీ.. కార్యకర్తలకు ‘అమ్మఒడి’ లాంటిది.. ఇందుకు సాక్ష్యం ఇదే!

ఏ రాజకీయ పార్టీలో అయినా కుళ్లు, కుతంత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. పెద్దలందరూ స్వార్థానికి పోయి తమ జేబులు నింపుకోవడానికే అవస్థలు పడుతుంటారు కానీ.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల్ని ఏమాత్రం పట్టించుకోరు. అవసరమైనంతవరకు వాడుకొని వదిలేస్తారు కానీ.. వారిని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోరు. ఇంకా నిందలు మోపి బయటకు గెంటేయడమే పనిగా పెట్టుకుంటారు. ఏదేమైనా.. ప్రతి పార్టీలో పెద్దలదే పైచేయి, కార్యకర్తలు బలి!

కానీ.. టిడిపి మాత్రం అందుకు భిన్నం. కార్యకర్తల పట్ల ‘అమ్మ’లా ఉంటూ వారి లాలనా పాలనా చూసుకుంటోంది. పార్టీ కోసం నిత్యం శ్రమించే కార్యకర్తలకు.. వారి కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడంలో ఎప్పటికీ ముందుంటుంది. అసలు జాతీయ పార్టీలు సైతం ఏర్పాటు చేయని ‘కార్యకర్తల సంక్షేమ విభాగం’ టిడిపి ఏర్పాటు చేసింది. పసుపు జెండా రెపరెపలాడటం కోసం ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని పనిచేసిన కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలకు ఆర్థిక, విద్య, వైద్య, వివాహ అవసరాలు తీర్చడానికి 2014 మహానాడులో యువనేత నారా లోకేశ్ ఒక విభాగం ఏర్పాటు చేయవలసిందిగా ప్రతిపాదించారు. కార్యకర్తల కోసం ఇలాంటి వ్యవస్థను నిర్మించిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అది కేవలం తెలుగుదేశానికి మాత్రమే సాధ్యం.

ఇరు రాష్ట్రాలలో పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల కుటుంబాలను కూడా కష్టకాలంలో అండగా నిలబడటం ఈ విభాగం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే ఈ విభాగం ద్వారా వేలాదిమంది కార్యకర్తలకు విద్య, వైద్యం, వృద్ధాప్యం, వివాహంలాంటి అనేక సందర్భాలలో సహాయార్థం చేయడం జరిగింది. అనాధలైన పార్టీ కార్యాకర్తల పిల్లల కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా నిర్వహించిన విషయం తెలిసింది. అంతేకాదు.. ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన పిల్లల్ని వివిధ ప్రైవేటు విద్యాలయాలలో చేర్పించడం కూడా జరుగుతుంది. పార్టీ నుంచి ఈ సహాయ సహాకారాలు ఆశించి కార్యకర్తలు తమ సభ్యత్వ కార్డు నకలు జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరో విశేషం ఏమిటంటే.. పార్టీ సభ్యులకు టిడిపి భీమా కూడా కల్పిస్తున్నారు. భారతదేశ రాజకీయాల్లో సభ్యత్వం తీసుకున్న తమ పార్టీ సభ్యుల కోసం ప్రమాద భీమా సౌకర్యాన్ని అమలు చేసి చూపించిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం మాత్రమే. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు రు. 2,00,000/- అందించే బీమా సౌకర్యాన్ని టిడిపి ప్రారంభించింది. దీంతోపాటు వివిధ ఆసుపత్రులలో రాయితీలు కల్పించడం కూడా జరిగింది. సభ్యుడు ప్రమాదవశాత్తు మరణిస్తే, వారి కుటుంబం 100% మొత్తం బీమా అందుకుంటారు.

రెండు అవయవాలు/రెండు కళ్ళు/ఒక అవయవం/ఒక కన్ను నష్టం జరిగితే ఇందులో భీమా పొందిన మూలధన మొత్తం 100% చెల్లిస్తారు. ఒకవేళ ఒక అవయవం, ఒక కన్ను నష్టం జరిగితే ఇందులో భీమా పొందిన మూలధన మొత్తం 50% చెల్లిస్తారు. సభ్యుని మరణం సంభవించినప్పుడు, రూ.5,000 / – ప్రతి పిల్లలు (ఇద్దరి కంటే ఎక్కువ ఉండరాదు) విద్య విషయంలో అందిస్తున్నారు. ప్రమాదంలో ఆసుపత్రిలో చేర్చడానికి వైద్య ఖర్చులు రూపాయలలో 50,000 వరకు నగదు పరిహారం/ – కూడా సభ్యులకు అందిస్తున్నారు. కార్యకర్తల కోసం ఇన్ని సదుపాయాలు కల్పిస్తుందన్న టిడిపి పార్టీ వాళ్లకి ‘అమ్మఒడి’లాంటిదని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి.

Comments

comments