తెలుగు ఇండస్ట్రీలో డీఎస్పీ ముసలం..మార్చి నుంచి సినిమా థియేటర్లు మూత..షూటింగులు బంద్..??

telugu film industry digital service providers movies bundh producers

తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరు నిర్మాతలను దెబ్బతీసే విధంగా ఉంది అని అందుకు నిరసనగా మర్చి 1 నుంచి థియేటర్లు అన్నీ మూసివేయాలని, సినిమా చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని తద్వారా సినిమాలేవీ విడుదల చెయ్యకుండా తగు ముందస్తు చర్యలు చేపడుతుంది నిర్మాతల మండలి.

ప్రముఖ సంస్థలైన యూఎఫ్ఓ, క్యూబ్, పీఎక్స్‌బీ వంటి సంస్థలు ఒక్కో చోట ఒక్కో విధంగా వారి వ్యవహారతీరు ఉండడం వలన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు. అయితే ఇతర రాష్ట్రాల్లో వారానికి రూ.2500 అద్దె తీసుకుంటున్న ప్రొవైడర్లు మన దగ్గర మాత్రం రూ.10,800 తీసుకొంటున్నారని..వారంలో ఒక్క షో వేసినా ఏడు రోజులకి డబ్బులు వసూలు చేస్తున్నారని..దీంతో నిర్మాతలు నష్టపోతున్నారనే వాదన వినిపిస్తున్నది.

చర్చలకు పిలిచినా తమ మొండి వైఖరితో చర్చించడానికి రావడం లేదని అందుకే అత్యవసర మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు సురేష్ బాబు. మరి ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది విడుదలవబోతున్న స్టార్ల సినిమాల పరిస్థితి ఏంటో. దాదాపు 1000కోట్ల బిజినెస్ చేసే పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్న 2018 సంవత్సరంలో ఏమి జరుగుతుందో..సూపర్ స్టార్ రజనీ, మరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు వచ్చే ఏడాది మార్చ్ తర్వాత సమ్మర్ కి విడుదల అయ్యే లోపు సమస్య ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఆశిద్దాం.

Comments

comments