‘అ!’ “ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం”…రెజీనా కొత్త అవతారం…!!

regina cassandra awe! movie nani raviteja

గ్లామర్ పాత్రలకంటే భయపెట్టే పాత్రలకే మొగ్గుచూపుతున్నట్టు ఉన్నారు టాలీవుడ్ భామలు. తాజాగా రెజీనా కేసేంద్ర లుక్ చూస్తే ఆ అనుమానం కలగక మానదు. ఒక ఇంటర్వ్యూలో డిసెంబర్ నెలలో మీకు షాక్ ఇవ్వబోతున్న అని ముందే ప్రకటించిన రెజీనా నిజంగానే షాక్ ఇచ్చింది. నాని సమర్పణలో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘అ!’ సినిమాకు సంబంధించిన పోస్టర్ లుక్ విడుదలచేశారు ఆ పోస్టర్ చూశాక ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన ఈ భామ ఉన్నట్టుండి ట్రాక్ మార్చేసిందా అన్నట్టు అందరికీ షాక్ ఇచ్చింది.

ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న నిత్యా మీనన్, ఈషా రెబ్బా పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేసినా రాని రెస్పాన్స్ రెజీనా లుక్ తో ఒక్కసారిగా సంపాదించింది ఈ సినిమా. ఇప్పటికే 90% పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మిగతా షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకుని 2018 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధం కాబోతుంది అని నాని తెలిపారు. ‘ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజ్ రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్న ఈ సినిమాని ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు.

Comments

comments