కన్నుకి కన్ను సమాధానం కాని సమాధానం..పగ లేని బతుకు బతుకే కాదు..ఆర్జీవీ

ram-gopal-varma-web-series-kadapa-redla-katha-trailer

రాయలసీమ మగోళ్ళు అమ్మ కడుపులోనుంచే కత్తి పట్టుకుని పుడతారు. అది అక్కడి వాళ్ళ నమ్మకం. అదే పనిగా పెట్టుకుంటే ఎవడినైనా చంపవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ఏ ఒక్క పాత్ర కూడా కల్పితం కాదు. కానీ ప్రాణ భయం వలన వాళ్ళ పేర్లు..వాళ్ళు నివసిస్తున్న ఊళ్ళ పేర్లు కూడా మార్చడం జరిగింది. ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు నూటికి నూరు పాళ్ళు ముమ్మాటికీ నిజం. అంటూ వర్మ తాను తీయబోతున్న వెబ్ సిరీస్ లోని అంశాల గురించి చాలా నిస్సంకోచంగా చెప్పాడు.

స్మశానంలో సమాధుల్లా నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ఊరిలోని శవాల్లాంటి ఇళ్లల్లో కొన్ని దశాబ్దాల కింద బ్రతికుండే మనుషులుండేవారు. వాళ్ళకి కుటుంబాలుండేవి..వాళ్ళూ నవ్వే వాళ్లు..ఏడ్చే వాళ్ళు..పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు..పిల్లల్ని కనేవాళ్ళు..కానీ వాళ్ళందరి జీవితాల్లోకి ఫ్యాక్షన్ పేరుతో ఒక రూపం లేని రాక్షసి ప్రవేశించింది. ముసలి, ముతక, పిల్లా, జల్లా, ఆడా, మగా..ఇలా అందరూ ప్రతీకారంతో రగిలిపోయి వెంటపడి నరుక్కునే ట్రైలెర్ తో వర్మ రక్తం చిందించి మరీ చూయించాడు.

రాయలసీమలో చిన్నపిల్లలా దగ్గరనుంచి ముసలి వాలా వరకు పగతో ఎలా శత్రువులను చంపుతారో ఆడవారిని ఎలా హింసిస్తారో కళ్ళకు కట్టాడు వర్మ. వర్మ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ లో కడప గడప కడప గడప అంతో సాగిన వర్మ పాట వర్మ లోని ఫంక్షన్ కసిని తెలియజేసింది.

ఫ్యాక్షనమ్మ వెలిసింది సీమలో.. ఆ అమ్మ గుడి రాయలసీమ అయితే దాని గర్భగుడి కడప.. ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర అంటూ ట్రైలర్‌ ను ముగించాడు. గతంలో కొన్ని అనివార్య కారణాల వలన తాను చెప్పాలనుకున్న విషయాలను వెలుగులోకి తేలేకపోయానని.. ఇప్పుడు అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపిస్తానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.

కొందరు సీమ నేతల మాటలను సూక్తుల రూపంలో చూపించటం చూస్తే వర్మ ఎలాంటి అంశాలను చూపించబోతున్నాడోనన్న ఆసక్తి మొదలైపోయింది. ఈ సిరీస్ ద్వారా వర్మ తనలోని కసితో పాటు తాను చెప్పాలనుకున్న నిజాల్ని సైతం ఎలా చెప్తాడో అని రాజకీయనాయకులు..ఫ్యాక్షన్ లీడర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Comments

comments