ఊరుకిచ్చిన మాటకోసం చిరు చెప్పిన మాట..సుకుమార్ పాటిస్తాడా..??

ram charan ransthalam sukumar chiru re shoot

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 మీద ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తి పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లో నిర్మితమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను మెగా స్టార్ చింజీవి రీషూట్ చేయమన్నట్టు వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తాను నటించిన ఊరుకిచ్చిన మాట సినిమాలో సన్నివేశాలను తలపించేలా ఉన్నాయి అని ఆ భాగాన్ని మొత్తం మల్లె షూట్ చెయ్యాలి అని చెప్పినట్టు వార్తల్లోని ముఖ్యాoశం. ఇదిలా ఉంటే దాదాపు సుకుమార్ ఎక్కడ కాపీ కొట్టే వ్యక్తి కాదు..ఏ సినిమాలోని సన్నివేశం కూడా రిపీట్ చేసే స్వభావి అసలే కాదు..ఒకవేళ కచ్చితంగా అలాంటిదే చెయ్యాల్సి వస్తే మాత్రం పాత ఛాయలు కనిపించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు సుకుమార్.

మరి అలాంటి సుకుమార్ డైరెక్షన్ లోనే తప్పులు ఎంచి మళ్ళీ షూట్ చెయ్యమన్నాడు అంటే చిరంజీవి ఎంతటి మేధావో అర్ధం అవుతుంది. చిరు ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న రంగస్థలం సినిమాలో చరణ్ సరసన సమంత నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. సినిమాను 2018 మార్చి 30న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్.

Comments

comments