అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ కి వాళ్ళని పిలవద్దు..ఘాటుగానే సూచించిన పవన్..!!

pawan kalyan trivikram agnyaathavaasi audio launch december 19

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.
త్వరలోనే ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఈ నెల 19న హైదరాబాద్ లోజరగనున్న విషయం తెలిసిందే. పవన్ అభిమానులు భారీగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించినట్టు సమాచారం. కాగా ఈ ఆడియో ఫంక్షన్ కి చాలా కొద్దిమందిని మాత్రమే పిలవాలని ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో పాటు అభిమానులను మాత్రమే పిలవాలి అని కూడా పవన్ సూచించినట్టు సమాచారం. అంతే కాకుండా సభావేదికకు సరిపడా మాత్రమే ఆహ్వానాలు పంపాలని, బయటి వ్యక్తులు ఎవరినీ అదేవిధంగా సినిమాకు సంబంధం లేని ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ చెప్పినట్టు సమాచారం.

నగరంలో భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుకుండా ఏర్పాట్లు జరిగేలా తన సన్నిహితులకు చెప్పినట్టు వినికిడి. ఇక అజ్ఞాతవాసి సినిమా ఆడియోకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు మీడియాలో తెగ ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ మాత్రం ఈ ఫంక్షన్ కు చిరంజీవి రావడం లేదు అని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలు, ముందస్తు అపాయింట్‌మెంట్ కారణాల వలన చిరంజీవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ముఖ్య అతిథిగా వెంకటేష్ వస్తున్నట్టు అయితే దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం చూస్తుంటే ఎవరినీ పిలవకుండా కేవలం అభిమానుల సమక్షంలో మాత్రమే ఆడియో ఫంక్షన్ జరుపుకునే విధంగా పవన్ జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Comments

comments