మల్టీస్టారర్ తో షాకిస్తున్న నాచురల్-కింగ్..భారీ స్కెచ్చేసిన శ్రీరామ్..!!

nani nagarjuna multi starer sriram adithya

ఒక ఫార్ములాలో వచ్చిన ఏ సినిమా అయినా హిట్ అయితే చాలు ఇక ఆ తర్వాత వచ్చే సినిమాలు అన్నీ అదే తరహాలో అదే ఫార్ములాను బేస్ చేసుకుని వచ్చేస్తాయి. ఇప్పుడు తెలుగులో అదే ట్రెండ్ నడుస్తోంది. ఒక దర్శకుడు ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ చేస్తే ఇక మిగిలిన వారు కూడా అదే తరహాలో సినిమా చేసేలా ప్లాన్ చేస్తుంటారు.

దానికి తగ్గట్టే హీరోలు కూడా నేను తనతో చేద్దాం అనుకుంటున్నా..అంటూ ఎక్కడో ఒక చోట ప్రకటించేస్తారు. ఇంకేమి ఉంది వారిరువురి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా ఇలా ఒక మూస పద్దతిలో సినిమాలు చేస్తున్నారు మన తెలుగు హీరోలు, దర్శకులు. కొత్తధనం కోరుకునే ప్రేక్షకుడి మనసు తెలుసుకుని వీరు అలా సినిమాలు చేస్తున్నారా..వారికి ఇష్టం వచ్చినట్టు పరాయి భాషా సినిమాలను కాపీ చేసి మన దగ్గర సినిమాలు చేస్తున్నారా ఏమీ అర్ధం కానీ పరిస్థితి.

అలా నడుస్తోందే ఇప్పటి మన తెలుగు సినిమా మల్టీస్టారర్ల హవా. కాగా ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన జోడి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. నాచురల్ స్టార్ నాని, యువసామ్రాట్ నాగార్జున లతో శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తుంచబోతున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నాని, నాగార్జున సినిమాను 2018 ఫిబ్రవరిలోనే సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు శ్రీరామ్. ఇదిలా ఉంటే నాని నటించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి'(ఎంసీఏ), నాగార్జున నిర్మాతగా అఖిల్ తన రెండో సినిమా ‘హలో’ తో ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Comments

comments