బాబుకు పవన్ కళ్యాణ్ కు భలే కలిసొచ్చింది..స్వామికార్యం-స్వకార్యం.. దెబ్బకు రెండు..??

mahesh kathi comments on pawan kalyan chandrababu agnathavasi movie trivikram

బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు మహేష్ కత్తి. బిగ్ బాస్ షోకి ముందు చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన మహేష్ కత్తి ఆ తర్వాత చాలా పాపులారిటీ సంపాదించాడు. ఒక పక్క సినిమాలపై క్రిటిక్స్ రాస్తూ మరో పక్క పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తూ. పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్లకు ఆయన అభిమానులు మహేష్ కత్తికి చుక్కలు చూయించారు. తాజాగా మహేష్ కత్తి మరోమారు పవన్ కళ్యాణ్ చేసిన పర్యటన మీద, అజ్ఞాతవాసి సినిమా మీద పేస్ బుక్ లో పోస్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిపిన పర్యటన ఇటు పవన్ సినిమా అజ్ఞాతవాసికి, అటు చంద్రబాబు రాజకీయానికి బాగా కలిసొచ్చిందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని కామెంట్ పోస్ట్ చేసారు.


ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో…చేగువేరా ఎక్కడికి పోయాడో… ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో…హతవిధి! ఏమిటీ మీమాంస?

ప్రత్యామ్నాయ రాజకీయాలకు,దళిత అనుకూల రాజకీయాలకు జనసేన పార్టీ ఒప్పుకుంటే, సానుకూలంగా స్పందిస్తాను అన్నాను. అంత మాత్రాన పార్టీలో జాయిన్ అవుతానని కాదు. ముందు పంథా మార్చుకుంటే చూద్దాం! Why not ! If only Janasena had more sensible guys like Kalyan Dileep Sunkara, it will have some face saving in public.

Comments

comments