అసలు నీ గోల ఏంటో అర్థం కావడం లేదు..ముందు నువ్వు నిజాయితీగా పని చెయ్..మధుర శ్రీధర్

madhura-sreedhar-reddy-prakash-raj-tweet-narendra-modi

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు. గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో మోడీ ప్రభుత్వం చెప్పినన్ని సీట్లు గెలవలేదు అని, మోడీ 150పైన స్థానాలు గెలుస్తానని ప్రకటించారు..మరి గెలవలేదే అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.గత కొంత కాలంగా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అనే యాష్ టాగ్ తో ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మరీ ట్వీట్స్ చేస్తున్నారు. ‘ప్రియ‌మైన ప్రధాన‌మంత్రిగారూ..గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించినందుకు అభినంద‌న‌లు. కానీ మీరు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారా? 150 ప్ల‌స్ సీట్లు సాధిస్తామ‌న్నారు క‌దా.. ఏమైంది? ఎందుకు సాధించలేకపోయారు.. ఒక‌సారి పునరాలోచన చేసుకోండి. స‌మ‌స్య‌లు ఎక్క‌డున్నాయో తెలుసుకోండి. విభ‌జ‌న రాజ‌కీయాలు ప‌నిచేయ‌లేదు. గ్రామీణుల‌ను, పేద‌ల‌ను, రైతుల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. వారి గొంతు బిగ్గ‌ర‌గా వినిపిస్తోంది.. మీరు వింటున్నారా’ అంటూ ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు.. టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రకాష్ రాజ్..అసలు నీ గోల ఏంటో అర్థం కావడం లేదు. నీ అహంకారంతో ఎంతో మంది నిర్మాతలు, డైరెక్టర్లను ఇబ్బంది పెట్టావు కదా. నువ్వు సంతోషంగా ఉన్నావా?’..కేవలం హెడ్ లైన్లలో ఉండాలని ప్రయత్నించకు. ముందు నువ్వు నిజాయితీగా పని చేయ్. నువ్వు ఒక లీడర్ అనే అభిప్రాయం మాలో కలిగించు, ఆ తర్వాత ఎదుటివారి మీద కామెంట్ చెయ్. నీ వ్యాఖ్యలను మేము సీరియస్ గా తీసుకుంటాం’ అంటూ శ్రీధర్ ట్వీట్ చేశారు.

Comments

comments