‘పరువు కోసం’ చంద్రబాబు హీరో..నేను కమెడియన్‌ : శివప్రసాద్

dr-shivaprasad-chandrababu-classmates-sixth-class-paruvu-kosam-drama-hero-comedian

డా. శివప్రసాద్‌ అన్ని రంగాల్లో తనదైన ప్రతిభ కనబరుస్తూ ఇటు సినిమాలలో కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, అటు రాజకీయ నాయకుడిగా, డాక్టర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుని ప్రేక్షకుల నుంచి రివార్డులు, ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు సంపాదించారు. డా. శివప్రసాద్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” చిత్తూరు జిల్లాలోని పురిత్తివారిపల్లి పక్కా పల్లెటూరు మా ఊరు.

చుట్టూ పంట పొలాలు మధ్యలో మా ఊరు. పొద్దున్నే లేవగానే పొలాల్లో నార్లు నాటుతూ, నేతం వేసి నీళ్లు తోడుతూ పాటలు పాడుతూ ఉండేవారు.సాయంత్రం అవ్వగానే  కోలాటం, చెక్క భజనలు వేసేవారు. అవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆ సౌండింగ్‌ అంతా నా మైండ్‌లో పడింది.ఫస్ట్‌ ఒకసారి వీధి నాటకాలు వేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్‌ చేయడం జరిగింది. హైస్కూల్‌లో ఓ మాస్టారు సంగీతం, డ్రామాలు డైరెక్ట్‌ చేసేవారు.

ఆరో తరగతి నుండి మాకు అవకాశాలు వచ్చాయి. నేను బాగా పాడేవాడ్ని. యాక్ట్‌ చేసేవాడ్ని.ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి స్టైల్‌గా వుండేవాడ్ని. అన్నింట్లో ముందుండేవాడ్ని. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చంద్రబాబునాయుడు, నేను ఇద్దరం క్లాస్‌మేట్స్‌. మేం ఇద్దరం కలిసి ‘పరువు కోసం’ అనే ఒక నాటిక వేశాం. అందులో చంద్రబాబు హీరో. నేను కమెడియన్‌గా చేశా. హైస్కూల్‌ తర్వాత నేను మెడిసిన్‌లోకి వెళ్ళాను. అంటూ ఎన్నో సంగతులను పంచుకున్నారు డా.శివప్రసాద్.

Comments

comments