పవన్ కళ్యాణ్ – దిల్ రాజుకు ఇచ్చిన మాట నిజం చేస్తాడా…

dil raju birthday speech comments on pawan kalyan

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. త్వరలోనే నాని ఎంసిఏ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దిల్ రాజు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. రాజు గారు చెప్పుకొచ్చిన విషయంలో అందరినీ ఆశ్యర్యానికి గురిచేసిన విషయం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడ్డం.

అప్పుడెప్పుడో నేను రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా..నీతో సినిమా చెయ్యడానికి నేను ఎప్పుడైనా సిద్ధం..రాజకీయాలకు నీతో సినిమా చెయ్యడానికి ఏ మాత్రం ఇబ్బందిలేదు..అని అన్నట్టు..పవన్ కళ్యాణ్ తనతో అన్నటువంటి మాటలను బయటపెట్టారు దిల్ రాజు. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ దాసరి గారితో, మణిరత్నంతో సినిమా చేస్తా అని కూడా మాట ఇచ్చారు.ఇది కూడా అలానే అయి ఉంటది..మాట అన్నంత మాత్రాన సినిమా అవుద్దా అని విమర్శించేవారు ఉన్నారు. మరి దిల్ రాజు నమ్మకం నిజం అవుతుందా..పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా.

Comments

comments