‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాడో తెలుసా…??

agnyathavasi-audio-function-pawan-kalyan-speech

పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో చాలా అట్టహాసంగా పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య అతికొద్ది మంది ప్రముఖుల మధ్య జరిగింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్.. దేశంకోసం ఏదో చెయ్యాలి.. మన జాతీయ జెండా అంటే నాకు చాలా ఇష్టం..ఆ జెండాని చూసిన ప్రతీసారి నా గుండెల్లో ఒక రకమైన ఉత్తేజం వస్తది అంత ఇష్టం ఆ జెండా అంటే. నా దేశంకోసం ఏదో చెయ్యాలి అందుకే నేను రాజకీయాలవైపు వచ్చా ఇలా మొదలుపెట్టాడు పవన్.

తనకి ఇష్టమైన వాళ్ళని తలచుకుంటూ, కష్ట కాలంలో, ఓటమిలో ఉన్నప్పుడు తన వెన్నంటే ఉండి వెన్నుతట్టి ప్రోత్సహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి..విజయాలు పొందినప్పుడు తన పంచన చేరే వారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు పవన్. సినిమాల్లోకి వచ్చిన నాడు ఉన్న స్నేహితుల దగ్గర నుంచి నేటి అజ్ఞాతవాసి సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ వరకు అందరినీ పేరు పేరునా పిలుస్తూ పవన్ మాట్లాడిన తీరు అద్భుతం.

త్రివిక్రమ్ చెపితేనే పవన్ చేస్తాడు..తివిక్రమ్ లేకపోతే పవన్ కి ఏమి చేతకాదు అని చాలా మంది అంటున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా త్రివిక్రమ్ లేకపోతే నిజంగానే నేను లేను మేము ఇద్దరం దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వాచం మాకు ఎవరు లేరు మాకు మేమే..అని కాస్త ఘాటుగానే స్పందించారు పవన్. ఆ వీడియో మీ కోసం…

Comments

comments