విజయ్ నా ఈగో రెచ్చగొట్టకు..సైలెంట్ గా ఉండను..రివేంజ్ తీర్చుకుంటా..వనిత ఆడియో టేప్..కేసులో కొత్త మలుపు

actor comedian vijaysai suicide wife vanitha audio case mystery

రోజుకో మలుపు తిరుగుతున్న సినీ నటుడు,కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య కేసు. తాజాగా వెలుగులోకి వచ్చిన భార్య వనిత విజయ్ కు పంపిన ఆడియో క్లిప్‌.

‘నాకు ఎంత ఈగో రేజ్‌ అవ్వాలి. విజయ్‌ నీకు అలాంటివేమి ఉండవనుకుంటా.. నాకు చాలా ఎక్కువ. ఒక్కసారి నా ఈగో రెచ్చగొడితే అది లైఫ్‌ లాంగ్‌ బ్లడ్‌లో అలా ఉండిపోతుందంతే. నీకు తెలియదు కదా నా గురించి చూడు రివేంజ్ ఎలా ఉంటుందో. రివేంజ్ తీర్చుకోకుండా ఉండను. ఎందుకంటే నేను సైలెంట్‌గా ఉండను. నేను ఇంతవరకు ఎంత దిగజారానో నాకు తెలుసు. అర్థమైందా? నేను మళ్లీ ఎలా బతుకుతానో నువ్వు చూద్దువు గాని బాధ పడకు, కంగారు పడకు సరేనా?’ అంటూ వనిత మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి.

కానీ విజయ్ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో మాత్రం వనితతో పాటు తన చావుకు కారణం అని నాన్నా ఎవరినీ వదలకు..అందరికీ శిక్ష పడేలా చూడు అని చెప్పిన సంగతి తెలిసిందే.కాగా విజయ్ అంత్యక్రియల తర్వాత మాయమైన వనిత ఇప్పటివరకు ఎక్కడ ఉందొ కూడా తెలియని పరిస్థితి.

అజ్ఞాతంలోకి వెళ్లిన వనితను అరెస్ట్ చేసేందుకు గానూ పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు కానీ విజయ్ మరణానికి కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని మరో పక్క విజయ్ తండ్రి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనిత మాట్లాడిన ఆడియో మీకోసం….

Comments

comments