పవన్ కళ్యాణ్ త్యాగానికి అవధుల్లేవా..ఆఖరికి ఆ పదవి కూడా వద్దన్నాడా..పవన్ నిర్ణయాన్నిఅభిమానులు సమర్థిస్తారా..??

pawan kalyan janasena agnyathavasi sacrifice chief minister

పవన్ కళ్యాణ్ ఒక ప్రభంజనం..పవన్ కళ్యాణ్ ఒక సునామి..కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..ఇవి ఎవరో అంటున్న మాటలు కాదు..పవన్ కళ్యాణ్ ని దేవుడుగా భావించే అభిమానులు ముద్దుగా, ధైర్యంగా, గౌరవంగా, అభిమానంగా తలెత్తుకుని సగర్వముగా పిలుచుకునే మాటలు. పవన్ స్థాపించిన జనసేన పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయి అభ్యర్థులతో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిన విషయమే.

అయితే అందులో కొత్తేముంది అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు పవన్ కళ్యాణ్ ని దేవుడు అని ఎందుకు అంటారో అవును పవన్ కళ్యాణ్ నిజంగా దేవుడే..ఎందుకంటే ఒకవేళ జనసేన పార్టీ 2019లో జరగబోయే ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టాల్సి వస్తే పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాడు. అవును పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలే తన అజెండాగా జనం ముందుకు వచ్చాడు.

కాబట్టి ‘నేను మీ సేవకుడిని మాత్రమే..మీ మీద అధికారం చెలాయించాలని నేను రావడం లేదు..నేను మీలో ఒకడిని’ అందుకే ‘ముఖ్యమంత్రి పదవిలో నేను కాదు నా తరపున మరో వ్యక్తి ఆ కుర్చీలో కూర్చోబోతున్నాడు’ నేను పార్టీ అధినేతగా మాత్రమే ఉంటాను..అని పవన్ చెప్పినట్టు పవన్ వ్యక్తిగత సహచరుల సమాచారం. మరి ఈ వార్త విన్న తర్వాత పవన్ అభిమానులు ఊరుకుంటారా..?? ఎంతైనా పవన్ అభిమానులు కదా పవన్ చెపితే వినకుండా ఉంటారా..చూద్దాం వైరలవుతున్న ఈ వార్తలో నిజమెంత దాగివుందో..

Comments

comments